Site icon NTV Telugu

Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..

Pakistan

Pakistan

Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

Read Also: Joe Root: 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన జో రూట్.. తొలిరోజు ఆధిపత్యం ఇంగ్లాండ్దే

అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA)ను పాక్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోంది. ఐఎంఎఫ్ షరతులకు లోబడి పీఐఏను పాక్ వదిలించుకోవాలని అనుకుంటోంది. ఎయిర్ లైన్‌లో 51 శాతం నుంచి 100 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉంది. ఐఎంఎఫ్ రుణ ఒప్పందం ప్రకారం, గతంలో పాక్ 1 బిలియన్ డాలర్లు(రూ.9000 కోట్లు) అప్పు పొందింది. డిసెంబర్ 8న జరిగే సమావేశంలో 1.2 బిలియన్ డాలర్లు( రూ. 10,800 కోట్లు) అప్పుగా కోరబోతోంది. అయితే, ఈ అప్పును పొందాలంటే ఈ ఏడాది నాటికి పాక్ ఈ ఎయిర్ లైన్స్ టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలి.

పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్‌ను టేకోవర్ చేయడానికి ప్రస్తుతం 4 కంపెనీలు పోటీలో ఉన్నాయి. వీటిలో పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. దీనిని నేరుగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నియంత్రిస్తాడు. ఈ కంపెనీ సైన్యం నియంత్రణలోని ఫౌజీ ఫౌండేషన్ కింద ఉంది. టెండర్లు వేసిన మిగిలిన 3 కంపెనీలు.. లక్కీ సిమెంట్ కన్సార్టియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్టియం, ఎయిర్ బ్లూ లిమిటెడ్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ పౌరులు లేదా కంపెనీలు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టడంతో విదేశీ కంపెనీలు బిడ్డింగ్ లోకి రాలేదు. పీఐఏని అమ్మడం ద్వారా 8600 కోట్ల పాకిస్తానీ రూపాయలను సేకరించవచ్చు. ఇందులో పాక్ ప్రభుత్వానికి 15 శాతం వస్తుంది.

Exit mobile version