Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.