Site icon NTV Telugu

India-Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్‌ని బహిష్కరించండి: పహల్గామ్ బాధితులు..

Pahalgamattack

Pahalgamattack

India-Pakistan Match: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రెండు దేశాల మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో తమవారిని కోల్పోయిన బాధితులు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ‘‘మా కళ్లలో నీళ్లు ఇంకా ఆరిపోలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్ కూడా జరుగుతుందా..?’’ అని బాధితురాలు కిరణ్ బెన్ ప్రశ్నించారు. ఆమె భర్త సుదీర్భాయ్ పర్మార్, 17 ఏళ్ల కుమారుడు స్మిత్ యతీష్బాయ్ పర్మార్‌లను ఈ మారణహోమంలో కోల్పోయారు.

Read Also: Kantara Chapter 1: కన్నడలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్న కాంతార చాప్టర్-1 మేకర్స్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలని సదరు కుటుంబం కోరింది. ఈ నేపథ్యంలో బాధితులు, అమరవీరుల కుటుంబాలు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ముఖ్యమైంది కాదని భావిస్తున్నామని చెబుతున్నారు. మీడియాతో కిరణ్ బెన్ మాట్లాడుతూ.. ‘‘మా కళ్ళలో కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదు, మరియు వారు మ్యాచ్ ఆడుతున్నారు. ప్రజలు దాని గురించి మాట్లాడుకోవడం వినడం కూడా బాధాకరం, వారు ఆడటం చూడటం గురించి చెప్పనవసరం లేదు. ఆపై మన సైనికులు కూడా అమరులయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాద రాజ్యంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలి.’’ అని భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. పాక్ సైన్యం భారత్‌పై దాడికి యత్నించడంతో, భారత్ పాకిస్తా్న్ ఎయిర్‌బేసుల్ని నాశనం చేసింది.

Exit mobile version