80 Terrorists Killed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది భారత్ సైన్యం.
Read Also: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఆ పేరులోనే మొత్తం సందేశం..!
అయితే, సీనియర్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. బహవల్పూర్, మురిద్కేలలో రెండు అతి పెద్ద దాడులు జరిగాయి.. ప్రతి ప్రదేశంలో 25–30 మంది ఉగ్రవాదులు మరణించారు అన్నారు. ఇక, మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ఇప్పటికీ ధృవీకరిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ దాడి తర్వాత భారత సైన్యం “న్యాయం జరిగింది” అనే సందేశాన్ని వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
