Site icon NTV Telugu

Ajit Pawar: ఎన్సీపీకి షాక్ ఇవ్వనున్న అజిత్ పవార్.. 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి..?

Ajit Pawar

Ajit Pawar

NCP’s Ajit Pawar joining hands with BJP..?:మహరాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతేడాది శివసేనను చీల్చి ఏకంగా ఏక్ నాథ్ షిండే బీజేపీ సహకారంలో సీఎం అయ్యారు. ఈ రాజకీయ వేడి చల్లారకముందు ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీనియర్ లీడర్ శరద్ పవార్ కు షాకిచ్చేలా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమచారం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న రాజకీయ పరిణామాల్లో, అక్కడి ప్రజల్లో ఇదే చర్చ నడుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బీజేపీ అగ్రనేతలు ఢిల్లీకి హుటాహుటిన వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

ఇటీవల కాలంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీని పొగిడారు. ఈ పరిణామాలు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్) మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిని ఇరకాటంలో పడేశాయి. వరసగా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చి దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లిందని అజిత్ పవార్ అనడం సంచలనంగా మారింది. ఇది మోదీ మ్యాజిక్ కాకుంటే ఇంకేంటంటూ..? ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే..

శరద్ పవార్ మేనల్లుడు అయిన అజిత్ పవార్ కు మద్దతుగా మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు పలుకున్నట్లు సమాచారం. 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీతో చేతులు కలిపేందుకు ఎన్సీపీలో చీలిక తెస్తారనే వార్తల మధ్య వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మంగళవారం మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని ఖండించారు.

ప్రస్తుత ఉన్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది అజిత్ పవార్ కు మద్దతుగా బీజేపీతో చేతులు కలిపాలని, షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగం కవాలని అజిత్ పవార్ ఉద్దేశాన్ని సమర్థించారని తెలుస్తోంది. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్ మరియు ధనంజయ్ ముండేతో సహా పలువురు నేతలు అజిత్ పవార్ వెంటే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, జితేంద్ర అవద్ మాత్రం బీజేపీతో చేతులు కలిపేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఈ విషయం పార్టీ చీఫ్ శరద్ పవార్ కు కూడా తెలిసిందని, ముందుగా వ్యతిరేకించినప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో పొత్తుకు సై అంటున్నారని తెలిసింది.

Read Also: R Ashwin Daughter : తండ్రి అవుటవ్వగానే బోరున ఏడ్చేసిన కూతురు

మహారాష్ట్ర క్లీన్ స్వీప్ లక్ష్యంగా బీజేపీ..

రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో లోక్ సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. అజిత్ పవార్ తోపాటు ఎన్సీపీ కలిసి వస్తే మహారాాష్ట్రలో మెజారిటీ సీట్లు ఎన్డీయే ఖాతాలో ఉంటాయి. దీంతో పాటు ఈడీ కేసులు ఎదుర్కొంటున్న అజిత్ పవార్ కుటుంబ, ప్రఫుల్ పటేల్, హసన్ ముష్రీఫ్ వంటి వారికి ఉపశమనం లభిస్తుంది. మహారాష్ట్రలో పాటు ఉత్తర్ ప్రదేశ్ తోడైతే 2024లో బీజేపీ అధికారాని ఢోకా ఉందనే భావనలో ఆ పార్టీ ఉంది. దీంతో పాటు ఎన్సీపీ నేతల నియోజకవర్గాలకు నిధులు వస్తాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపుకు తిరుగుండదని ఎన్సీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే ఇదంతా శరద్ పవార్ ఆమోదం లేకుండా జరగదని, ఆయన మద్దతు లేకుండా అజిత్ పవార్ ప్రణాళిక విఫలం అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version