India Russia: “మా సంబంధం చాలా దృఢం, ట్రాన్స్లేషన్ అక్కర్లేదు”.. పుతిన్ వ్యాఖ్యలపై మోడీ నవ్వులు..
- రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ..
- పుతిన్..మోడీల మధ్య ద్వైపాక్షిక సమావేశం..
- మా బంధం దృఢమైంది.. మాకు ట్రాన్స్లేషన్ అక్కర్లేదన్న పుతిన్..
- ఒక్కసారి మోడీ చిరునవ్వు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మోడీకి నవ్వు తెప్పించింది. ‘‘రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి. అనువాదం లేకుండా తన వ్యాఖ్యల్ని ప్రధానిమోడీ అర్థం చేసుకుంటారు’’ అని రష్యా అధ్యక్షుడు అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రధాని మోడీతో పాటు రెండు దేశాల అధికారులు నవ్వారు.
Read Also: Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
చాలా సందర్భాల్లో పుతిన్, ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని ప్రశంసించారు. పుతిన్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. గత మూడు నెలల్లో తాను రెండుసార్లు రష్యాలో పర్యటించడం మా సన్నిహిత సమన్వయం, లోతైన స్నేహానికి నిదర్శనమని, జూలైలో మాస్కోలో జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశం అన్ని రంగాల్లో మా సహకారాన్ని బలోపేతం చేసిందని అన్నారు. “రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదంపై మేము నిరంతరం టచ్‌లో ఉన్నాము. సమస్యలను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాలని మేము విశ్వసిస్తున్నాము” అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Kazan, Russia: "We have such a relationship that I felt that you do not need any translation" said Russian President Vladimir Putin at the bilateral meeting with Prime Minister Narendra Modi
(Source: Host Broadcaster via Reuters) pic.twitter.com/Cvq7pMFeGj
— ANI (@ANI) October 22, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!