Site icon NTV Telugu

India Russia: “మా సంబంధం చాలా దృఢం, ట్రాన్స్‌లేషన్ అక్కర్లేదు”.. పుతిన్ వ్యాఖ్యలపై మోడీ నవ్వులు..

Putin, Modi

Putin, Modi

India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మోడీకి నవ్వు తెప్పించింది. ‘‘రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి. అనువాదం లేకుండా తన వ్యాఖ్యల్ని ప్రధానిమోడీ అర్థం చేసుకుంటారు’’ అని రష్యా అధ్యక్షుడు అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రధాని మోడీతో పాటు రెండు దేశాల అధికారులు నవ్వారు.

Read Also: Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు..

చాలా సందర్భాల్లో పుతిన్, ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని ప్రశంసించారు. పుతిన్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. గత మూడు నెలల్లో తాను రెండుసార్లు రష్యాలో పర్యటించడం మా సన్నిహిత సమన్వయం, లోతైన స్నేహానికి నిదర్శనమని, జూలైలో మాస్కోలో జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశం అన్ని రంగాల్లో మా సహకారాన్ని బలోపేతం చేసిందని అన్నారు. “రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదంపై మేము నిరంతరం టచ్‌లో ఉన్నాము. సమస్యలను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాలని మేము విశ్వసిస్తున్నాము” అని ప్రధాని మోదీ అన్నారు.

Exit mobile version