Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను స్పీకర్‌తో సమావేశం అయ్యాను.. నాపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తక్షణమే రికార్డుల నుంచి తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక, ఈ విషయాన్ని పరిశీలిస్తానని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు అని రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల విలేకరులతో వెల్లడించారు.
Read Also: Akhanda 2 : అఖండ 2 నుంచి సాలీడ్ అప్ డేట్.. ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
కాగా, భారతీయ జనతా పార్టీ నేతలు ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, మేము పార్లమెంట్ సమావేశాలను సక్రమంగా నడపాలని మాత్రమే కోరుకుంటున్నాము అని అన్నారు. సభను నడిపించడమే మా లక్ష్యం.. ఈ సభలో చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు. బీజేపీ నాయకులు నాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పనివ్వండి.. డిసెంబర్ 13న రాజ్యాంగ చర్చ జరిగేలా తాము కోరుకుంటున్నాము అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.