Asaduddin Owaisi: హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భజరంగ్ దళ్ వ్యక్తులే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గో సంరక్షులను బీజేపీ కాపాడుతోందని.. హర్యానా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్దారు. జునైడ్, నాసిర్ ల మరణాలు అమానవీయం అని ఓవైసీ అన్నారు. గో రక్షక్ అనే ముఠానే వీరద్దరిని చంపిందని.. వారికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
ఈ హత్యల్లో మైనారిటీలపై హింస లక్ష్యంగా ఉందని అన్నారు. హిందూ రాష్ట్రాన్ని కోరుకునే వారే జునైద్, నాసిర్లను హత్యలు చేశారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థికృత ముస్లిం ద్వేషం ప్రబలుతోందని, నిందితులపై చర్యలు తీసుకుంటారా లేదా..? అని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గో రక్షకుల అనే వేషధారణలో ప్రజలను చంపి, దోపిడిలకు పాల్పడుతున్న ఇలాంటి రాడికల్ ఎలిమెంట్స్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని.. ఇలాంటి వారిని ప్రోత్సహించడం మానేయాలని ఓవైసీ అన్నారు.
Read Also: Imran Khan: క్యాన్సర్ చికిత్సకు నొప్పి మాత్ర వాడతారా.? పాక్-ఐఎంఎఫ్ డీల్ పై విమర్శలు..
ఈ కేసులో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ, పోలీసులు కుమ్మకయ్యరాని ఆరోపించారు. హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించే వరకు జునైడ్, నసీర్లకు న్యాయం జరగదని అన్నారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని.. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగదని అన్నారు. మీరు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించవచ్చు. కానీ యూట్యూబ్ లో ఉంటున్న ఇటువంటి నేరాల హింసాత్మక వీడియోలను నిషేధించలేదని అన్నారు.
రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35) బుధవారం కిడ్నాప్‌కు గురయ్యారు. మరసటి రోజు హర్యానా భివానీలోని లోహరులో కాలిపోయిన బొలేరో వాహనంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. భజరంగ్ ధల్ లో సంబంధం ఉన్న గోసంరక్షకులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ హత్యల్ని ఖండించారు.
