NTV Telugu Site icon

Maharashtra: మహారాష్ట్ర ఇండీ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు..? ఠాక్రే సమాధానం..

Thacjeray

Thacjeray

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఇండియా కూటమి మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. 48 పార్లమెంట్ స్థానాల్లో ఇండియా కూటమి 30 స్థానాల్లో గెలిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం 17 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి శివసేన (యుబిటి), కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) దూకుడుగా వెళ్తోంది.

Read Also: Blackmailing: సివిల్స్లో ఫెయిల్.. దొంగగా మారి ఏం పనులు చేస్తున్నాడో తెలుసా..?

అయితే, ప్రతిపక్ష కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తగిన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామని, ముందు బీజేపీ ప్రభుత్వం వైఫల్యాన్ని చూపించాలని అన్నారు. మహారాష్ట్ర వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సభలో చర్చలు వాడీవేడిగా సాగనున్నాయి. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఉద్ధవ్ ఠాక్రే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై స్పందించారు. నీట్, యూజీసీ-నిట్ పేపర్ లీక్స్‌పై ప్పందించారు. అయోధ్యలో రామమందిర గర్భగుడిలోకి వర్షపు నీరు లీక్ అవుతుందనే నివేదికను ఆయన ప్రస్తావించారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చాలా పేపర్లు లీక్ అయ్యాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు.