Site icon NTV Telugu

Operation Sindoor: 15 బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి రుచిచూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Madras High Court: నిందితులు మాత్రమే పోలీస్ టాయ్‌లెట్స్‌లో ఎందుకు జారిపడుతున్నారు..?

ముందుగా, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి సంబంధించి రాడార్లు, క్షిపణి వ్యవస్థల్ని యాక్టివేట్ చేసేలా, భారత వైమానిక దళం పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఒక విధంగా చెప్పాలంటే డమ్మీ జెట్స్‌ని ఉపయోగించింది. దీంతో పాకిస్తాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయనేది భారత్‌కి తెలిసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ కావడంతోనే భారత్ హరోప్, కామికేజ్ డ్రోన్లను ఉపయోగించి వాటిపై దాడి చేసి, పాక్ ఎయిర్ డిఫెన్స్ పనిచేయకుండా చేసింది. ఈ వ్యూహంతో భారత్ పాకిస్తాన్‌కి చైనా ఇచ్చిన HQ-9 క్షిపణి బ్యాటరీలతో సహా దాని రాడార్‌ని నాశనం చేసింది.

దీని తర్వాత, భారత్ తన అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిపణితో పాటు స్కాల్ప్ వంటి క్షిపణుల్ని ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా ప్రయోగించి మొత్తం 11 పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. రిపోర్టుల ప్రకారం దాదాపుగా భారత్ 15 బ్రహ్మోస్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఒక ఘర్షణ సమయంలో భారత్ తొలిసారిగా బ్రహ్మో్స్‌ని వాడింది. ఈ దాడి భయంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తన విమాన స్థావరాలను మార్చాల్సి వచ్చింది. ఈ దాడిలో పాక్‌లో అత్యంత ముఖ్యమైన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, స్కర్దు, జకోబాబాద్ వంటి వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

Exit mobile version