NTV Telugu Site icon

Operation Sarp Vinash 2.0: జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 షూరు..

Army

Army

Operation Sarp Vinash 2.0: భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉగ్రవాదుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి ఇండియా- పాకిస్తాన్ బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారత భద్రతా దళాలపై విచక్షణారహితంగా ఉగ్రమూకలు కాల్పులు జరుపుతున్నాయి. దేశంలోకి అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా టెర్రరిస్టులు భారత సైనికుల ప్రాణాలను తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదలను సమూలంగా ఏరి వేసేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: BRS Leaders: నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్న బీఆర్ఎస్ టీం..

అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. హిట్‌లీస్ట్‌లో గుర్తించిన 55 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0‌ను స్టార్ట్ చేయబోతుంది. అయితే, ఈ ఆపరేషన్ ఏకంగా ప్రధాని మోడీ ఆఫీసులో నుంచే పర్యవేక్షిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అందులో భాగస్వాములైన ఆర్మీ అధికారులు, ట్రూప్ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేశారు.

Read Also: Shah Rukh Khan: షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడుగా!

అయితే, కీలక ప్రాంతాల్లో దాదాపు 200 మంది స్నైపర్లు, 500 మంది పారాకమాండోలతో కలిసి 4 వేల అదనపు బలగాలను ఇండియన్ ఆర్మీ మోహరించింది. దేశంలోని ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారత సైన్యం ఈ ఆపరేషన్‌‌కు ప్లాన్ చేసింది. ఇందులో స్థానికులను కూడా ఇందులో భాగస్వాములను చేసింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడానికి విలేజ్ డిఫెన్స్‌ గార్డ్స్‌ సహాయాన్ని భారత సైన్యం కోరింది. స్థానిక పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది అని ఆర్మీ చీఫ్ భావిస్తున్నారు.