Supreme Court: నేరాలు చేసి పారిపోయిన వాళ్లను పట్టుకొచ్చే హక్కు ఉంది..
- నేరాలు చేసి పారిపోయిన వారినిపట్టుకొచ్చే అధికారం కేంద్రానికి ఉంది..
- గుజరాత్‌కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులు..
- దుబాయ్‌కు పారిపోయిన ఉద్వానీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కరెక్టే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చే సర్వాధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయితే, గుజరాత్‌కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులకు సంబంధించి జారీ అయిన రెడ్ కార్నర్ నోటీస్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిల్ ను విచారణకు తిరస్కరించినట్లు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పేర్కొనింది.
Read Also: TTD : యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్… శ్రీవారి దర్శనంపై జీవితకాల నిషేధం
Also Read
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఇక, 2022 జులైలోనే దుబాయ్‌కు పారిపోయిన మీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కరెక్టేనంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్వానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ సందర్భంగా.. మీపై అనేక ఆరోపణలు, 153 కేసులు సైతం ఉన్నాయి.. ముందు భారత్ రావాల్సిందే.. వస్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం చెబుతామని అనుకో వద్దని తెలిపింది. అయితే, తన పిటిషన్‌దారుకు తనపై 38 కేసుల వివరాలు కూడా తెలీయదని అతడి తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. వివరాలు తెలీయదంటే ఎలా? ట్రయల్ కోర్టుకు వెళ్లి సర్టిఫైడ్ కాపీల కోసం అప్లై చేస్తే వాళ్లే ఇస్తారని తెలిపింది. ఇదేం రాకెట్ తయారీ శాస్త్రం కాదు.. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లలోని వివరాలను అధికారులు చెప్పడం లేదని లాయర్ వాదించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.
Read Also: YouTube: “జై భజరంగబలి”.. 500 కోట్ల వ్యూస్ సాధించిన తొలి ఇండియన్ వీడియోగా “హనుమాన్ చాలీసా”..
అయితే, ఎఫ్‌ఐఆర్ వివరాలు మీకు దుబాయ్‌కి వచ్చి బంగారు పళ్లెంలో పెట్టి అందించాలా? ముందు భారత్‌కు రండి.. వచ్చిన తర్వాత అన్ని వివరాలు అందిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఉద్వానీ దగ్గర ప్రస్తుతం పాస్‌పోర్ట్ లేదు.. ఎలా మరి? అని ప్రశ్నించగా.. అంత కష్టపడొద్దు.. అధికారులు అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తారులే అని న్యాయస్థానం చెప్పింది. అతడి తోటి నిందితుడు భారత్‌లో పోలీస్ కస్టడీలో మరణించాడు.. అందుకే నా పిటిషనర్ భారత్‌కు వచ్చాక సీసీటీవీ నిఘా ఉన్న గదిలోనే పెట్టాలని అడ్వకేట్ కోరగా.. ఇంక ఈ పిటిషన్‌పై విచారణ చేయలేమని ధర్మాసనం సీరియస్ కావడంతో ఆ పిటిషన్‌ను లాయర్ విత్ర డ్రా చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!