Monkeypox: కేరళలో మంకీపాక్స్‌తో 22 ఏళ్ల వ్యక్తి మృతి.. దేశంలో తొలి మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. మనదేశంలో కూడా ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వాటిలో మూడు కేసులు కేరళలో వెలుగు చూశాయి. మరొకటి ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ సమయంలో కేరళలో మంకీపాక్స్ మరణం కలకలం రేపుతోంది. దీనితో భారతదేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైనట్లైంది. కేరళలోని త్రిసూర్ జిల్లా పున్నియార్‌లో 22 ఏళ్ల యువకుడు వైరస్‌తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన యువకుడు యూఏఈ నుంచి జులై 21న భారత్‌కు వచ్చాడు. అనంతరం జ్వరం, తలనొప్పితో ఎక్కువ కావడంతో జులై 27న ఆస్పత్రిలో చేరాడు. అతని శరీరంపై మంకీపాక్స్ లక్షణాలు లేకపోవడంతో ఆ దిశగా చికిత్స అందించలేదు. అయితే, శనివారం ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం అతడికి యూఏఈలో జులై 19నే మంకీపాక్స్ సోకిన విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. యూఏఈ నుంచి భారత్‌కు బయలుదేరే ముందు వచ్చిన మంకీపాక్స్ పరీక్ష ఫలితాన్ని వైద్యులకు అందించారు. దానిని మరోసారి నిర్ధారించుకునేందుకు కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మృతుడి నమూనాలను స్థానిక వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు
COVID 19: స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు.. 39 మరణాలు
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే పరీక్షలు నిర్వహించగా.. అక్కడే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి చెప్పారు. దీంతో అతడి నమూనాలను మరోసారి పరీక్షకు పంపించిన కేరళ ఆరోగ్యశాఖ అధికారులు.. అతడి మృతికిగల కారణాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. మంకీపాక్స్ కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. దీన్ని దేశంలో తొలి మంకీపాక్స్ మరణంగా భావిస్తున్నారు. కాగా ఈ మరణానికి సంబంధించిన రిపోర్టును అలప్పూజలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. యువకుడి మృతదేహాన్ని మంకీపాక్స్ ప్రొటోకాల్‌కు అనుగుణంగానే ఖననం చేసిన అధికారులు.. అతడి ప్రైమరీ కాంటాక్టులను పర్యవేక్షణలో ఉంచారు. ఇదే విషయంపై మాట్లాడిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్.. యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలేవీ కనిపించలేదన్నారు. దీంతోపాటు అతడికి మంకీపాక్స్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని యూఏఈ అధికారులు తెలియజేయకపోవడంపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతామని వీణా జార్జ్ అన్నారు.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!