NTV Telugu Site icon

Jamili Elections: నేడు లోక్‌సభకు ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. తమ ఎంపీలకు కాంగ్రెస్, బీజేపీ త్రీ లైన్ విప్ జారీ

Jamili Bill

Jamili Bill

Jamili Elections: వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ఈరోజు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలు తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ విప్‌ జారీ చేశాయి. ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరాయి. సభలోకి వెళ్లే ముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక, సభలోకి రెండు బిల్లులు రానున్నాయి. అందులో ఒకటి జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024 కాగా.. మరోకటి, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం నేడు లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది.

Read Also: Donald Trump: హష్‌ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ..

అయితే, ఈ మేరకు వాటిని ఇవాళ లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం–ఒకే ఎన్నికకు సంబంధించిన ఈ బిల్లులను ఈరోజు మధ్యాహ్నం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ ఓం బిర్లాను మంత్రి అభ్యర్థించే అవకాశం ఉంది.

Read Also: Draupadi Murmu: నేడు ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మంగళగిరిలో ట్రాఫిక్ ఆంక్షలు!

ఇక, ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను లోక్ సభ స్పీకర్‌ స్పీకర్ ఓం బిర్లా నియమించనున్నారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్చించనున్నారు. అయితే, మెజార్టీ ఉన్న బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన తర్వాత కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. అవసరమైతే దాని గడువు పొడిగిస్తారు. ఈ నెల (డిసెంబర్) 20వ తేదీతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి.. కాబట్టి, జమిలి బిల్లులను ఈరోజే సభలో ప్రవేశపెట్టబోతున్నారు. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు సపోర్టు ఇస్తుండగా.. మరో 15 పార్టీలు వ్యతిరేకించినట్టు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ పేర్కొనింది.

Show comments