NTV Telugu Site icon

Big Breaking : మరోసారి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు

Sonia Gandhi Ed

Sonia Gandhi Ed

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు ​​జారీ చేసినట్లు అధికారిక వర్గాల వెల్లడించాయి. 75 ఏళ్ల సోనియా గాంధీకి జూన్ 2న కోవిడ్‌ బారిన పడ్డారు. అయితే అప్పటికే ఈడీ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా సోకడంతో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరకాలేదు.

Tarun Chugh : రాష్ట్రంలో కేసీఆర్‌కి ప్రజలు “బై..బై..” చెప్తారు

జూన్ మధ్యలో సోనియా గాంధీ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే.. ఈడీ ముందు హాజరు కావడానికి మరింత సమయం కావాలని కోరింది. ఈ క్రమంలోనే తాజాగా జులై 21న సోనియాగాంధీ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణలో పాల్గొనాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణలో రాహుల్‌ గాంధీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే.