Omicron variant XE: ఒమిక్రాన్ ఎక్స్‌ఈ కలకలం.. గుజరాత్‌లోనూ వెలుగు చూసింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కల్లోలం నుంచి బయటపడి.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ ఎటాక్ చేసినా.. మళ్లీ కేసులు తగ్గిపోయాయి.. ఈ మధ్య కేసులు పెరుగుతోన్న ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం.. వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసులను ప్రస్తావిస్తూ.. అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు రాకేష్ భూషణ్. మరోవైపు.. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న సరికొత్త బ్రిటన్ వేరియంట్ ఎక్స్‌ఈ.. భారత్‌లోనూ వెలుగు చూసింది.. ఇప్పటికే ముంబైలో ఈ కేసు నమోదు అయినట్టు వార్తలు రాగా.. తాజాగా గుజరాత్‌లో ఓ వ్యక్తి కూడా దాని బారిన పడ్డారు.. ఇక, ఎక్స్‌ఎం వేరియంట్ కూడా వెలుగుచూసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ వారం మొదట్లో.. విదేశాల నుండి వచ్చిన ఓ వ్యక్తి ఎక్స్‌ఈ వేరియంట్ బారిన పడ్డట్లు మీడియాలో కథనాలు రాగా.. వాటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది.. అది ఎక్స్‌ఈ వేరియంట్‌గా నిరూపితం అవ్వలేదని పేర్కొంది.
Read Also: Death threat: ఎప్పుడైనా చంపేస్తాం.. మాజీ సీఎంలు సహా 61 మందికి బెదిరింపులు..!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
తాజావార్తలు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?