Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా.. ప్రభుత్వంలో చేరని కాంగ్రెస్..
- జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం..
- 6 ఏళ్ల తర్వాత కొలువుదీరిన కొత్త ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం 90 స్థానాల్లో పోటీచేసి 48 చోట్ల గెలిచాయి. అయితే, ఎన్సీ 42 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 06 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఎన్సీకి ఇండిపెండెంట్లు, ఆప్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ మెజారిటీ మార్క్ 46ని దాటింది.
Read Also: IAS Petition: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్‌లు..
Also Read
రాబోయే ఎన్సీ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిని తిరస్కరించిన కాంగ్రెస్, బదులుగా బయట నుంచి మద్దతు అందిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హోదాపై ఎన్సీ చర్చలు జరుపుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఇదిలా ఉంటే, ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే హాజరయ్యారు. వీరితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా ప్రమాణస్వీకారానికి వెళ్లారు. షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC)లో ఈరోజు ముఖ్యమంత్రి మరియు ఆయన మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేశారు. కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉదయం 11:30 గంటలకు అబ్దుల్లా మరియు అతని మంత్రులతో పదవీ ప్రమాణం చేయించారు.
జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ, పీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో బీజేపీ మద్దతుని జూన్ 19, 2018లో ఉపసంహరించుకుంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. దీని తర్వాత ఏడాదికి ఆర్టికల్ 370 రద్దు చేశారు. స్పెషల్ స్టేటస్ తీసేసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఎన్సీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్సీ తర్వాత 29 ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!