Site icon NTV Telugu

Om birla: లోక్‌సభ స్పీకర్ కుమార్తె జాబ్‌పై విమర్శలు.. హైకోర్టులో పరువు నష్టం దావా

Anjali Birla

Anjali Birla

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఆర్‌పీఎస్ అధికారిణిగా ఎంపికైన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి ఓం బిర్లా పలుకుబడి ఉపయోగించి అంజలి ఉద్యోగం సంపాదించిందని.. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గుకు రాగలిగారని నెటిజన్లు ట్రోల్స్ చేశారు. తన తండ్రి లోక్‌సభ స్పీకర్ కావడం కారణంగానే తొలి ప్రయత్నంలోనే అంజలి ఉద్యోగం సంపాదించగలిగిందని పోస్టులు తెగ వైరల్ చేశారు. సోషల్ మీడియా విమర్శలపై ఆమె న్యాయస్థానం మెట్లెక్కింది. తన పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ వాపోయింది. దీంతో ట్రోల్స్‌పై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా చేశారు. నిరాధార పోస్టుల్ని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కావాలనే టార్గెట్‌ చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె అభ్యర్థనను న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసులో ప్రతివాదులుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), జాన్ డోను చేర్చారు.

ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..

ఇటీవల కాలంలో యూపీఎస్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పూణెకు చెందిన పూజా ఖేద్కర్.. తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్‌కు ఎంపిక కావడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె సర్వీస్‌ను నిలిపివేసింది. యూపీఎస్సీని ప్రక్షాళన చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Brain eating amoeba: అద్భుతం.. “మెదుడుని తినే అమిబా”ని జయించిన 14 ఏళ్ల బాలుడు

Exit mobile version