ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని పురాతన దేవాలయాల స్థలంలో జామా మసీదు నిర్మించారంటూ ఆర్టీఐ కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నగరంలోని జామా మసీదును బౌద్ధ, జైన, హిందూ దేవాలయాలు ఉన్నచోటే నిర్మించారని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త అలీఘర్‌లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఆర్‌పీఎస్ అధికారిణిగా ఎంపికైన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి ఓం బిర్లా పలుకుబడి ఉపయోగించి అంజలి ఉద్యోగం సంపాదించిందని.. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గుకు రాగలిగారని నెటిజన్లు ట్రోల్స్ చేశారు.