Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
- ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
- వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తి
- బెంగాల్ ప్రజాప్రతినిధుల సభలో ఓం బిర్లా వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని, ప్రజాసేవలో విలువలు, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. పశ్చిమ బెంగాల్ 18వ శాసనసభకు ఎన్నికైన సభ్యులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఓం బిర్లా పాల్గొని ప్రసంగించారు.
స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తి అని.. కొత్త దిశను చూపిస్తుందన్నారు. స్వామి వివేకానంద వర్ధంతిని ప్రస్తావిస్తూ ఆయన జీవిత సందేశాన్ని గుర్తు చేశారు. స్వామి వివేకానంద ఆలోచనలు, కార్యాచరణ నేటికీ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఓం బిర్లా అన్నారు. “ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతి. ఆయనను స్మరించుకున్నప్పుడు ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఒక వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జీవితకాలంలో చేసిన పనులు, ఆలోచనలు, సమాజానికి అందించిన సేవలు ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.
Also Read
అలాగే ‘‘స్వామి వివేకానంద జీవితం యువతకు సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ నాయకత్వంలో కొత్త దిశను చూపిస్తుంది. ఆయన బోధనలు నేటి యువతలో సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రేరణగా నిలుస్తాయి” అని ఓం బిర్లా అన్నారు. ఓరియంటేషన్ కార్యక్రమంలో రాజ్యాంగ విలువలు, శాసనసభ కార్యకలాపాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై కూడా చర్చ జరిగింది.
#WATCH | Kolkata: At the orientation programme for the elected members of the18th Legislative Assembly of West Bengal, Lok Sabha Speaker Om Birla says, "It is the death anniversary of Swami Vivekananda today…When we remember Swami Vivekananda, his life inspires us. Even if a… pic.twitter.com/htS8Ml5ypW
— ANI (@ANI) July 4, 2026
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?