Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి

  • ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
  • వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తి
  • బెంగాల్ ప్రజాప్రతినిధుల సభలో ఓం బిర్లా వ్యాఖ్య
Ombirla

Ombirla

ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని, ప్రజాసేవలో విలువలు, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. పశ్చిమ బెంగాల్ 18వ శాసనసభకు ఎన్నికైన సభ్యులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఓం బిర్లా పాల్గొని ప్రసంగించారు.

స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తి అని.. కొత్త దిశను చూపిస్తుందన్నారు. స్వామి వివేకానంద వర్ధంతిని ప్రస్తావిస్తూ ఆయన జీవిత సందేశాన్ని గుర్తు చేశారు. స్వామి వివేకానంద ఆలోచనలు, కార్యాచరణ నేటికీ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఓం బిర్లా అన్నారు. “ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతి. ఆయనను స్మరించుకున్నప్పుడు ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఒక వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జీవితకాలంలో చేసిన పనులు, ఆలోచనలు, సమాజానికి అందించిన సేవలు ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.

అలాగే ‘‘స్వామి వివేకానంద జీవితం యువతకు సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ నాయకత్వంలో కొత్త దిశను చూపిస్తుంది. ఆయన బోధనలు నేటి యువతలో సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రేరణగా నిలుస్తాయి” అని ఓం బిర్లా అన్నారు. ఓరియంటేషన్ కార్యక్రమంలో రాజ్యాంగ విలువలు, శాసనసభ కార్యకలాపాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై కూడా చర్చ జరిగింది.