West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
- అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా..
- పోలీసుల సోదాలతో ఉద్రిక్త వాతావరణం..
- విషయం తెలిసి మేనల్లుడి ఇంటికి మమత పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పటికే ముక్కలుగా విడిపోయింది. మమతా బెనర్జీకి నమ్మకస్తులే హ్యాండ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, శనివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు అభిషేక్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్‌ని అరెస్ట్ చేయడానికి వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. సుమిత్ రాయ్‌పై అక్రమ వసూళ్ల కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
పోలీసులు అభిషేక్ ఇంటికి చేరుకుని సెర్చ్ చేయాలని కోరగా, ఆయన సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కొంత సేపు వాగ్వాదం తర్వాత పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన మాజీ సీఎం, టీఎంసీ అధినేతి మమతా బెనర్జీ హుటాహుటిన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి పరుగులు పెట్టారు. ఆమె అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం తర్వాత మమత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అయితే, శనివారం ఉదయం ఈ ఘటనపై మీడియా ప్రశ్నించగా అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
అభిషేక్ సహాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని టీఎంసీ ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని ఆరోపించారు. అభిషేక్ బెనర్జీపై ఇప్పటికే రెండు వేర్వేరు కేసుల్లో విచారణ జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో విద్వేషపూరిత ప్రసంగంపై సీఐడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు సంబంధించిన తీర్మానంపై పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని కూడా సీఐడీ విచారిస్తోంది. మరోవైపు, టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మదన్ మిత్ర నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మున్సిపల్ నియామక కుంభకోణంలో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!