Nirmala Sitharaman: పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన మొదటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అన్నారు. అలాగే, నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. మేం నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాం.. నిజాయితీగా ఉంటూ దేశానికి సేవ చేస్తున్నాం.. మీరు మా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీతో చర్చించిన తర్వాత ఆయన మార్గ నిర్థేశంతో ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చింది. అందుకే, ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ పన్ను తగ్గింపు ఆలోచన వెనక ప్రధాని మోడీ ఉన్నారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అయితే, నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నప్పటికి తమ ఆకాంక్షలు నెరవేరలేదని కంప్లైంట్ చేస్తున్న మిడిల్ క్లాస్ ప్రజల గొంతు తాము విన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ప్రధాని మోడీ అన్ని రంగాలకు చెందిన వ్యక్తులతో పాటు పరిశ్రమిక వర్గాల వాణిని కూడా విన్నారని చెప్పుకొచ్చింది. అందరిని కలిసి మాట్లాడుతారు.. వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారని పేర్కొనింది. ఈ ప్రభుత్వంలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన తొలి పూర్తి బడ్జెట్‌లో వేతన జీవులకు కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ అని వెల్లడించింది. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది.