Navy Officer Missing: చైనా వెళ్తున్న ఓడలో ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్

  • ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్
  • చైనా వెళ్తున్న ఓడలో అదృశ్యం
  • తన కొడుకును కాపాడాలని తల్లి వేడుకోలు
Navy Officer Missing

Navy Officer Missing

ఒడిశాకు చెందిన మర్చంట్ నేవీ అధికారి సార్థక్ మొహపాత్ర అదృశ్యమయ్యాడు. చైనా వెళ్తున్న ఓడలో మారిషస్ సమీపంలో తప్పిపోయాడు. ఈ మేరకు తల్లి రష్మిత మహాపాత్ర సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన కొడుకు సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రధాని మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సాయం కోరింది. కుమారుడికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది.

ఇది కూడా చదవండి: Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్‌స్టీన్ ఫైల్‌‌‌పై అడ్వాన్స్‌గా క్షమాపణలు

‘‘నేను (రష్మిత) తీవ్ర ఆందోళనలో ఉన్న ఒక తల్లిని. నాకు తక్షణ సహాయం కావాలి. నా కుమారుడు సార్థక్ మొహపాత్ర. ఫిబ్రవరి 3, 2026న సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు MVEA జెర్సీ అనే నౌకలో నుంచి అదృశ్యమయ్యాడు.’’ అని రాసుకొచ్చింది. ఫిబ్రవరి 2న ఓడ సింగపూర్ సమీపంలో ఉన్నప్పుడు.. కుటుంబ సభ్యులు… స్నేహితులతో మాట్లాడాడని తల్లి చెప్పింది. తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నామని.. క్షేమంగా కొడుకును తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.

సార్థక్ మహాపాత్ర..
ఒడిశాలోని భద్రక్ జిల్లా కేస్పూర్ గ్రామానికి చెందిన సార్థక్ మహాపాత్ర మర్చంట్ నేవీ అధికారి. ఫిబ్రవరి 3న మారిషస్ సమీపంలో ఓడలో విధుల్లో ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యవసర జోక్యం కోరిందని అధికారులు తెలిపారు. జూలై 2025 నుంచి ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు.