Obesity In India: హిమాచల్ ప్రదేశ్‌లో ఊబకాయులు ఎక్కువ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Obesity In India: భారత దేశం జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకుంది. కేవలం జనాభాలోనే కాకుండా ఇప్పుడు రోగాల్లో కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఊబకాయులు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ఇక మధుమేహంలో అయితే చిన్న వయస్సులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రధానంగా మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం.. ఈ మూడు వ్యాధులు ప్రపంచంలో కంటే భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియా డయాబెటిస్ నిర్వహించిన ఒక అధ్యయననాన్ని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీలో ప్రచురించారు. అయితే ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో అత్యధికంగా మధుమేహం, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలోనే అత్యధికులు ఈ రెండు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
మధుమేహం, ప్రీ డయాబెటిస్ వ్యాప్తి జాతీయ సగటు రేటు 11.4, 15.3 శాతంగా ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం మధుమేహం 13.5 శాతంగా.. ప్రీ డయాబెటిస్ 18.7 శాతంగా ఉందని పరిశోధకులు తెలిపారు. రాష్ట్రంలో హైపర్ టెన్షన్(బీపీ) రేటు 35.3 శాతంగా ఉంది. కానీ జాతీయ సగటు 35.5 శాతం కంటే కొంత తక్కువగానే ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఊబకాయం రేటు కూడా జాతీయ గణాంకాల కంటే చాలా ఎక్కువ. 38.7 శాతం రాష్ట్ర వాసులు ఊబకాయంతో బాధపడుతున్నారు. కానీ జాతీయ స్థాయిలో 28.6 శాతం ఉంది. గత దశాబ్ద కాలంగా ఈ వ్యాధుల ప్రాబల్యం కొలిచేందుకు ఇటువంటి స్థాయిలో అధ్యయనం జరగలేదు. కొన్ని దశాబ్దాల క్రితం పాఠశాల విద్యార్థుల్లో టైప్ 2 డయాబెటిస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా మధుమేహం పెరుగుతోంది. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం కొన్ని దశాబ్దాల క్రితమే పుంజుకోవడం ప్రారంభించాయని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు వెల్లడించారు. శారీరక శ్రమ లేకపోవడమే ఈ వ్యాధుల పెరుగుదలకు పెద్ద కారణంగా భావిస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో, తోటల్లో పనులు సొంతంగా చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పని సులభం చేసే పరికరాలు వచ్చిన తర్వాత శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇతర పనులకు కూలీలు దొరుకుతున్నారు. దీని వల్ల శరీరానికి సరైన శ్రమ లేకపోవడంతో బద్ధకం పెరిగిపోయింది. రోజుకి కనీసం 60 నిమిషాల పాటు శరీరాన్ని శ్రమ పెట్టె విధంగా పనులు చేయడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Read also: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రజలు ఆర్థికంగా మెరుగుపడటంతో పాటు వారి జీవనశైలి నిశ్చలంగా మారిపోతుంది. ఈ వ్యాధుల ప్రభావం పెరుగుదలకి దారి తీస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గతంలో వెల్లడించిన నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహ రొగులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. భారతదేశాన్ని ఇప్పటికే డయాబెటిస్‌కు రాజధానిగా పిలుస్తున్నారు. హైపర్ టెన్షన్, స్థూలకాయం, హైపర్ కొలస్ట్రొలేమియా వంటి వాటి వల్ల మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం భారతదేశం, అమెరికా, చైనా దేశాల్లోనే అత్యధికంగా మధుమేహం బారిన పడుతున్న వారి జనాభా ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!