Nupur Sharma: నా అడ్రస్ తెలుపొద్దు.. మీడియాకు నుపుర్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. పలు రాష్ట్రాల్లో గత శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా యూపీ ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ లతో పాటు జార్ఖండ్ రాంచీలో, పశ్చిమ బెంగాల్ హౌరాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో పాటు ఢిల్లీ జమా మసీదులో, హైదరాబాద్ మక్కా మసీదుల్లో ముస్లింలు తమ నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
దేశంలో పాలు అరబ్ ప్రపంచం నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఖతార్, బహ్రైన్, యూఏఈ, సౌదీ, ఇరాక్, మలేషియా వంటి దేశాలు తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి. నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ భారత్ కు తమ నిరసన తెలిపాయి. అయితే అరబ్ ప్రపంచం విమర్శలకు భారత్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది.
Also Read
అయితే ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి వరసగా నుపుర్ శర్మకు బెదిరింపుల వస్తున్నాయి. ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కొంత మంది నుపుర్ శర్మను చంపేస్తామని..తల నరికేస్తామని.. రేప్ చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నుపుర్ తో పాటు నుపుర్ శర్మ తల్లి, సోదరిని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా ఇండియా సిటీస్ లో దాడులు జరుపుతామని హెచ్చరించింది. ఇప్పటికే ఈ బెదిరింపులపై నుపుర్ శర్మ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు సెక్యురిటీ పెంచారు.
ఇదిలా ఉంటే ఆమె తాజాగా ఓ ట్వీట్ చేసింది. నా అడ్రస్ ను బహిరంగ పరచవద్దని.. మీడియా సంస్థలను కోరారు. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో తన అడ్రస్ బహిరంగ పరచవద్దని కోరింది.
I request all media houses and everybody else not to make my address public. There is a security threat to my family.
— Nupur Sharma (@NupurSharmaBJP) June 5, 2022
తాజావార్తలు
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!