Site icon NTV Telugu

PSLV-C61: ఇస్రో రాకెట్ వైఫల్యానికి కారణం ఇదేనా..?

Pslv

Pslv

PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన అధునాతన EOS-09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం కోసం ఉద్దేశించబడిన PSLV-C61 మిషన్ విఫలమైంది. ప్రయోగించిన కొన్ని నిమిషాలకే రాకెట్ తన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో, శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఈ శాటిలైట్ రాత్రి సమయాల్లో కూడా హై రెజల్యూషన్‌తో ఫోటోలు తీసే టెక్నాలజీ ఉంది. అయితే, ఈ ప్రయోగం విఫలం కావడంపై శాస్త్రవేత్తలు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Vodafone Idea: అత్యంత ఖరీదైన రూ.4999 ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల చేసిన వొడాఫోన్ ఐడియా.. ప్రయోజనాలేంటంటే..?!

ప్రాథమిక అంచనాల ప్రకారం, రాకెట్ మూడో దశలో ప్రోపల్షన్ సిస్టమ్‌లో అనుమానిత ఫ్లెక్స్ నాజిల్ పనిచేయకపోవడంతోనే ప్రయోగం విఫలమైనట్లు భావిస్తున్నారు. ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 5:59 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను ప్రయోగించింది, కానీ కీలకమైన మూడవ-దశ బర్న్ సమయంలో రాకెట్ పథం నుండి తప్పుకుంది.

44.5 మీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్‌లో మొదటి రెండు దశలు విజయవంతంగా పనిచేశాయి. ఘన ఇంధనంతో కూడిన PS1 కోర్, PS2 లిక్విడ్ స్టేజ్ ప్రణాళిక ప్రకారం పనిచేస్తాయి. రాకెట్ PS3 సాలిడ్ మోటార్ ఫేజ్‌లో సమస్యలు తలెత్తాయి. టెలిమెట్రీ చాంజర్ ప్రెజర్‌లో అకస్మాత్తుగా తగ్గుదల కనిపించింది. ప్లెక్స్ నాజిల్ కంట్రోల్ సిస్టమ్, రాకెట్ థ్రస్ట్ ని నియంత్రించే ఈ ప్లెక్స్ నాజిల్స్ ఖచ్చితమైన థ్రస్ట్ వెక్టార్‌కి కారణమవుతుంది. ఒక వేళ ఇది విఫలమైతే, రాకెట్ తన అలైన్‌మెంట్‌ని కోల్పోతుంది. వేగంగా తన మార్గం నుంచి పక్కకు జరుగుతుంది. ఇది ఫెయిల్ అయినట్లు అనుమానిస్తున్నారు.

Exit mobile version