Site icon NTV Telugu

Hijab: హిజాబ్ బ్యాన్‌పై సీఎం సిద్ధరామయ్య యూటర్న్.. అలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదంటూ..

Hijab

Hijab

Hijab: హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈ అంశం మరోసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాజకీయ రచ్చను ప్రేరేపించింది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్‌పై సీఎం సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తేయడంపై కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని శనివారం సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

Read Also: Pakistan: కాశ్మీర్‌లోకి ఉగ్రవాదుల్ని పంపేందుకు.. తన పోస్టును తగలబెట్టుకున్న పాక్ ఆర్మీ..

విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్వులను జారీ చేయలేదని మీడియా ముందు సీఎం చెప్పారు. అయితే నిషేధాన్ని ముగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ముందుగా అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ఈ ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిజాబ్ బ్యాన్ ఎత్తేయాలనే అంశం కాంగ్రెస్ ఎజెండాలో ఉంది.

లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతో సీఎం సిద్ధరామయ్య మైనారిటీ బుజ్జగింపులకు తెరతీశారని, కులాలు-మతాలుగా ప్రజల్ని కాంగ్రెస్ విభజించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు ముందు ఉంది. 2021లో డిసెంబర్ లో ఉడిపిలోని ప్రభుత్వ పీయూసీ కాలేజీలో ఆరుగురు బాలికను హిజాబ్ ధరించి తరగతులకు రావడంతో హిజాబ్ వివాదం మొదలైంది. మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ సమస్యగా మారింది.

Exit mobile version