Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Noida Towers Will Be Demolished Using 3500 Kg Explosives

Noida Twin Towers: 40 అంతస్తులు 35 క్వింటాళ్ల పేలుడు పదార్థాలు.. భవనం కూల్చేందుకు రంగం సిద్ధం

Published Date :August 19, 2022 , 6:11 pm
By BV Reddy
Noida Twin Towers: 40 అంతస్తులు 35 క్వింటాళ్ల పేలుడు పదార్థాలు.. భవనం కూల్చేందుకు రంగం సిద్ధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Noida Towers Will Be Demolished..using 3,500 kg Explosives: నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేతకు రంగం సిద్ధం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తేలడంతో.. ఏకంగా సుప్రీంకోర్టు కూల్చేవేతకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 28న మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా సూపర్ టెక్ లోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయనున్నారు. ఇప్పటికే అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు. కూల్చివేత సమయంలో స్థానికులు దూరంగా ఉండాలని కోరారు.

దాదాపుగా 100 మీటర్ల ఎతైన నోయిడా ట్విన్ టవర్స్ భవనం కూల్చివేత ఈ నెల 21నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మరింత గడువు కావాలని నోయిడా అథారిటీ చేసిన అభ్యర్థనతో కూల్చివేతను ఆగస్టు 28కి మార్చింది. ఈ జంట టవర్లలో మొత్తం 900 ఫ్లాట్లు, 21పైగా దుకాణాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ 40 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు ఏకంగా 3500 కిలోల( 35 క్వింటాళ్ల) పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. భవనంలోని పిల్లర్లకు 9400 రంధ్రాలను చేసి వాటిలో పేలుడు పదార్థాలు నింపి భవనాన్ని కూల్చివేయనున్నారు. ఇప్పటికే ఈ భవనం వద్దకు పేలుడు సామాగ్రితో పాటు ఇతర సామాగ్రిని చేర్చుతున్నారు.

Read Also: Dj Tillu 2: టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట..?

సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ నివాసితులను ఆగస్టు 28 ఉదయం 7 గంటల్లోపు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సాయంత్రం 4 గంటల తర్వాతే రావాలని అధికారులు స్థానికులకు తెలిపారు. యూకే నుంచి ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. ఈ పేలుడు వల్ల 50 మీటర్ల వ్యాస్తార్థం వరకు ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కూల్చివేత సమయంలో స్థానికంగా ఉన్న రెండు సొసైటీల నుంచి ఎలాంటి వాహనాలను ఈ ప్రాంతంలోని అనుమతించమని తెలిపారు అధికారులు. ఈ భవనం కూల్చివేత కోసం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను ఆగస్టు 28న మధ్యాహ్నం 2:15 నుండి 2.45 గంటల వరకు వాహనాల రాకపోకలకు నిలిపివేయనున్నారు. కూల్చివేత సంస్థ ఎడిఫైస్ ఇంజినీరింగ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ కూల్చివేతపై చర్చించాయి. కూల్చివేత ప్రాంతానికి కూతవేటు దూరంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను నిలిపి ఉంచడానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • New Delhi
  • Noida Towers Will Be Demolished
  • Noida Twin Towers
  • noida twin towers case
  • Supreme Court orders

తాజావార్తలు

  • AP High Court: భార్య వివాహేతర సంబంధం, పిల్లలకు డీఎన్ఏ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు!

  • Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు.. దక్కించుకున్నది ఎవరో తెలుసా?

  • Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్‌మీట్

  • IPL one Match Players: ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్ ఆడి కనుమరుగైన 11 మంది ప్లేయర్స్.. లిస్ట్‌లో పాక్, బంగ్లా ఆటగాళ్లు!

  • AP High Court: ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions