NTV Telugu Site icon

Sheikh Hasina: షేక్ హసీనాకి యూకే షాక్ ఇవ్వబోతుందా.. ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరణ?

Sheikhhasina

Sheikhhasina

Sheikh Hasina: అనూహ్య పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ ప్రధానికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ దేశంలో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ఇండియాకు చేరారు. ఇక్కడ నుంచి యూకేలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నారు. అయితే, ఆమెకు శరణార్థిగా ఆశ్రయం ఇవ్వడం పట్ల యూకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు యూకే నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.

షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం పట్ల యూకే హోం ఆఫీస్ తర్జనభర్జన పడుతోంది. బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చేందుకు, తాత్కాలిక ఆశ్రయం పొందే వ్యక్తులు యూకేకి వచ్చేందుకు అనుమతించబని యూకే హోం ఆఫీస్ మంగళవారం చెప్పింది. ఇటీవల ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచి, కైర్ స్టార్మర్ ప్రధానిగా అయ్యారు. ఆ సమయంలో ఆశ్రయం కోరే వ్యక్తుల మొదట చేరుకునే సురక్షిత దేశం యూకే అని చెప్పారు. వ్యక్తులకు అవసరమైన రక్షణ కల్పించడంలో యూకేకి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు. అయితే, ఆశ్రయం లేదా తాత్కాలిక శరణార్థిగా ఎవరైనా యూకేకి వెళ్లేందుకు అనుమతించే నిబంధనలు లేవు.

Read Also: Bangladesh Violence: మైనారిటీల పరిస్థితిపై ఆందోళన, భారతీయులతో టచ్‌లో ఉన్నాం.. పార్లమెంట్‌లో జైశంకర్..

76 ఏళ్ల షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఆర్మీ 45 నిమిషాల అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఆమె ఆ దేశ ఆర్మీ హెలికాప్టర్‌లో ఇండియా చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత ఇంటెలిజెన్స్ సంస్థల ‘‘రక్షిత కస్టడీ’’లో ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా చెల్లెలు షేక్ రెహానాకు యూకే పౌరసత్వం ఉంది. ఆమె మేనకోడలు తులిప్ సిద్ధిక్ బ్రిటిస్ లేబర్ పార్లమెంటేరియన్. ఇది ఆమెకు ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ బంగ్లాదేశ్ హింసపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో స్వతంత్ర విచారణ జరగా4లని కోరారు. బంగ్లాదేశ్‌కి శాంతియుత, ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం పిలుపునిచ్చారు. ఆ దేశంలో శాంతియుత, ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ధారించేందుకు యూకే పనిచేస్తుందని చెప్పారు. అయితే, ఆయన షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.