Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Prices: గత కొంత కాలంగా కేంద్రం పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గిస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిన్నింటిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతమైతే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రతిపాదన లేదని ప్రభుత్వం బుధవారం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో అస్థిరత ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రస్తుతం కేంద్రానికి అలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఇంధన ధరల తగ్గింపుపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొట్టిపారేశారు. ఇంధన లభ్యత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
Read Also: NCP: “రాముడు శాఖాహరి కాదు మాంసం తినేవాడు”.. ఎన్సీపీ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇటీవల క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ భారీ నష్టాలను చవిచూశాయని, ఇంధన ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ధరల పరిస్థితిని సమీక్షిస్తూ తాము స్థిరంగా, సానుకూలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇటీవలి నెలల్లో ఇంధన ధరలు తగ్గిన ఏకైక దేశం భారత్ అని ఆయన చెప్పారు. దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డిజిల్ ధరలు దాదాపుగా 40-80 శాతం పెరిగాయని, ఇతర పాశ్చాత్య దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, కానీ భారత్‌లో మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. నవంబర్ 2021, మే 2022లో రెండు సందర్భాలలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిందని కేంద్రమంత్రి గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!