Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరోసారి బెయిల్ నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీస్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్, అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యతిరేకించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టుకు విన్నవించింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ అవినీతి కేసులో సిసోడియాకు మార్చి 31న బెయిల్ తిరస్కరించింది న్యాయస్థానం. ఈ మొత్తం స్కామ్ లో దాదాపుగా రూ. 90-100 కోట్లు కిక్ బ్యాక్ తీసుకునే కుట్రలో సిసోడియా కీలక నిందితుడిగా ఉన్నాడని కేంద్ర ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి.
Read Also: Supreme Court: హంతకులకు ఎలా తెలిసింది..? అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు..
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
అంతకుముందు రోజు గురువారం సిసోడియా కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడగించింది. మే 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తు పురగతివలో ఉందని రిమాండ్ పొడగించాల్సిందిగా సీబీఐ చేసిన అభ్యర్థను కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశార. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు.
ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియానే కీలకంగా వ్యవహరించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్ కు చెందిన పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే గత వారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఇదంతా బూటకపు కేసు అని, అసలు లిక్కర్ స్కామే జరగలేదని ఆప్ పార్టీ ఆరోపిస్తోంది. కావాలనే బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ప్రతిపక్షాలను వేధిస్తున్నాయంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు.
తాజావార్తలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!