Site icon NTV Telugu

Nitish Kumar: ‘‘నా కుటుంబం కోసం ఏం చేయలేదు’’.. ఎన్నికల ముందు నితీష్ కుమార్ వీడియో మెసేజ్..

Nitish Kumar Jdu

Nitish Kumar Jdu

Nitish Kumar: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల ముందు సీఎం నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. 2005లో తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి తాను ‘‘నిజాయితీగా కష్టపడి పనిచేయడం ’’ ద్వారా ప్రజలకు సేవ చేశానని అన్నారు. మూడు నిమిషాల వీడియోలో.. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2005కు ముందు బీహారీగా ఉండటం అవమానకరమైన విషయంగా ఉండేదని చెప్పారు.

Read Also: Pakistan: పాక్‌లో “గుర్తుతెలియని వ్యక్తుల” హల్చల్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..

ప్రస్తుతం, బీహార్‌లో బీజేపీ+జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు విద్య, ఆరోగ్యం, విద్యుత్, తాగునీరు, వ్యవసాయం, యువతకు అవకాశాలను మెరుగుపరిచిందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళల కోసం ఏం చేయలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ‘‘మీరు హిందువు అయినా, ముస్లిం అయినా, అగ్రకులమైనా, వెనకబడిన వారైనా, దళితుడైనా మేము అందరి కోసం పనిచేశాము. నేను నా కుటుంబం కోసం ఏమీ చేయదు. బీహార్ ప్రజలకు సేవ చేశా’’ అని నితీష్ కుమార్ అన్నారు. తమకు ఇంకో అవకాశం ఇవ్వాలని, బీహార్‌ను అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా మారస్తామని చెప్పారు. ఎన్డీయే అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న లెక్కింపు జరుగుతుంది. రెండు కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార ఎన్డీయే కూటమిలో బీజేపీ+జేడీయూ+చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ ఉండగా, ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమిలో ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాలు ఉన్నాయి.

Exit mobile version