NTV Telugu Site icon

Nitish Kumar: కేంద్రానికి జేడీయూ కండీషన్.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం

Nitiesh

Nitiesh

కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత లేటెస్ట్‌‌గా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం మిత్ర పక్షాల సపోర్ట్ పిల్లర్స్‌పై ఆధారపడి ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కూటమి పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇదే మంచి అవకాశంగా జేడీయూ భావించింది. అవకాశం దొరికినప్పుడే సాధించుకోవాలన్న దృక్పథం కలిగి ఉన్న జేడీయూ.. దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్లాన్ రెడీ చేసింది.

ఇది కూడా చదవండి: D. Srinivas : డీఎస్ పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబు

మాస్టర్ ప్లాన్‌లో భాగంగా బీహార్‌లోని జేడీయూ సర్కా్ర్.. కేంద్రానికి సరికొత్త మెలిక పెట్టింది. శనివారం జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసింది. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా కాకముందే.. డిమాండ్లను తెరపైకి తెచ్చారు.

సమావేశం అనంతరం జేడీయూ సీనియర్‌ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ కొత్తదేమీ కాదని. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. అలాగే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని జేడీయూ డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక కఠినచట్టం చేయాలని కోరింది. బీహార్ పరిస్థితుల్ని అర్థం చేసుకుని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని జేడీయూ అభిప్రాయపడుతుంది. దీర్ఘకాలిక అవసరం తోనే ఈ డిమాండ్ చేస్తు్న్నట్లుగా జేడీయూ నొక్కి చెబుతోంది.

ఇది కూడా చదవండి: Monsoon Update: గుడ్‌న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు

తాజాగా జేడీయూ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గత పదేళ్లలో ఏ రాష్ట్రానికి మోడీ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ చేసింది. కానీ ఏ రోజూ కేంద్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం మోడీ సర్కార్.. మిత్ర పక్షాల సపోర్టుతో నడుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల డిమాండ్లకు తలొగ్గుతారా? లేదంటే లైట్ తీసుకుంటారో చూడాలి.

ఇది కూడా చదవండి: Collapse: ఢిల్లీ తర్వాత గుజరాత్ లో భారీ ప్రమాదం.. కూలిన రాజ్‌కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్