Nitish Kumar: రాజ్యసభలో ప్రమాణస్వీకారంపై నితీష్ కుమార్ డేట్‌ఫిక్స్.. ఎప్పుడంటే..!

  • పెద్దల సభకు వెళ్లిన బీహార్ సీఎం నితీష్ కుమార్
  • రాజ్యసభ ఎన్నికల్లో నితీష్ కుమార్, నితిన్ నవీన్ విజయం
  • ప్రమాణస్వీకారంపై డేట్‌ఫిక్స్
Nitishkumar

Nitishkumar

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగి విజయం సాధించారు. నితీష్ కుమార్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా రాజ్యసభకు వెళ్లారు. ఇద్దరూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరూ ఏప్రిల్ 10న రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఇంకా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు చేస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. అంతేకాదు.. తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరన్నది కూడా స్పష్టత రాలేదు. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవుతారన్నది వాస్తవం. కానీ ఎవరన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే సామ్రాట్ చౌదరికి ఆ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక జేడీయూ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏప్రిల్‌లో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు