Site icon NTV Telugu

Nitish Kumar: బీజేపీ ఓటమే లక్ష్యం నితీష్ పర్యటన.. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో భేటీ..!

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీహర్ సీఎం నితీష్ కుమార్ విపక్షాల లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమితో బీజేపీని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, వామపక్షాల కూటమి మహాఘటబంధన్ లాగే జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి కట్టేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మంగళవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిశారు. ఈ వారంలో శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలను ముంబైలో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: RCB vs MI: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ లక్ష్యం

గురువారం వీరిద్దరిని కలిసేందుకు నితీష్ కుమార్ ముంబై వెళ్తారని సమాచారం. ఇటీవల మహరాష్ట్రలో ఎన్సీపీలో సంక్షోభానికి శరద్ పవార్ స్వస్తి పలికారు. ఆయన ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీ నేతలు దీనికి ఒప్పుకోకపోవడంతో ఆయన మళ్లీ పదవిని చేపట్టారు. బీజేపీ వైపు చూస్తున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను అడ్డుకునేందుకు శరద్ పవార్ ఇలా ప్లాన్ చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఒడిశా పర్యటనను బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ విమర్శించారు. ఈ పర్యటన విఫలం అయిందని అన్నారు. భువనేశ్వర్ లో నితీష్ కుమార్ తో భేటీ తర్వాత నవీన్ పట్నాయక్ ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని చెప్పడం ఇది విపక్షాల ఐక్యతకు పెద్ద కుదుపు అని ఆయన అన్నారు. బీహార్ భవన్ ఏర్పాటు కోసం ఒడిశా వెళ్లినట్లు నితీష్ కుమార్ చెప్పడాన్ని సుశీల్ కుమార్ మోడీ ఎగతాళి చేశారు. పవార్, ఉద్దవ్ ఠాక్రేలను కలిసేందుకు ముంబైకి వెళ్తున్న ఆయన ముంబైలో బీహార్ భవన్ కోసం వెళ్తున్నారా..? అని ప్రశ్నించారు.

Exit mobile version