Site icon NTV Telugu

Nitish Kumar: ఎంతో మేలు చేశారు.. మోడీకి చప్పట్లు కొట్టరా? నితీష్ కుమార్ వీడియో వైరల్

Bihar

Bihar

ప్రధాని మోడీ సోమవారం బీహార్‌లోని పూర్ణియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మోడీ ఎంతో మేలు చేశారు.. కృతజ్ఞతలు చెప్పరా? కూర్చున్నారేంటి? అందరూ లేచి నిలబడి.. ప్రధాని మోడీకి చప్పట్లు కొట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సభకు వచ్చిన వారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. దీంతో ప్రధాని మోడీ కూడా నిలబడి అందరికీ నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Pakistan: పాక్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ చైల్డ్ స్టార్ ఉమర్ గుండెపోటుతో మృతి

ఈ సందర్భంగా నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో మాట విని ఇంతక ముందు వేరేవారితో కలిశానని.. ఇప్పుడు తిరిగి వచ్చేశానన్నారు. ఇకపై ఎక్కడికీ వెళ్లనని మోడీకి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. 2005లో జేడీయూ-బీజేపీ కలయికతో తొలిసారి నవంబర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి ఎన్నో మేలులు చేశారని జ్ఞాపకం చేశారు.

ఇది కూడా చదవండి: Group-1 Rankers Parents: నాకు భర్త లేడు.. రూ. 30 వేలు కూడా కళ్లతో చూడలేని పేదోళ్లం మేము..

అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. రెండు ప్రధాన కూటమిల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరుగుతోంది.

 

Exit mobile version