NTV Telugu Site icon

Nitish Kumar: నాకు ప్రధాని కావాలనే కోరిక లేదు..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: తనకు ప్రధాన మంత్రి కావాలనే కోరిక లేదని అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2024లో ప్రధాని కావాలనే కోరిక లేదని.. తన కోసం నినాదాలు చేయవద్దని తన పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కోరికను బయటపెట్టారు. ఆయన కోరికను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. రోబోయే ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై తాను దృష్టిపెట్టానని నితీష్ కుమార్ అన్నారు.

Read Also: Delhi High Court: భర్తపై భార్య వేధింపులు.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆయన సీఎం, ప్రస్తుతం తామంతా ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నాం.. ప్రస్తుతానికి ప్రతిపక్షాలను ఏకతాటి పైకి తీసుకురావడమే తమ ఎజెండా అని.. ప్రధాని కావాలనే కోరిక ఆయనకు లేదని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమార్ జనవరి 5 నుంచి ‘సమాధాన యాత్ర’లో ఉన్నారు. 18 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రలో గత 18 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన పనులపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు.

గతేడాది ఎన్డీయేలో భాగంగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, బీజేపీతో పొత్తును కాదనుకుంది. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో జతకట్టారు. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్షంగా మారింది. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ పార్టీలు మహాఘటబంధన్ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నుంచి లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ డిఫ్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.