Site icon NTV Telugu

Nita Ambani: కుమారుడి పెళ్లిలో అతిథుల్ని ఆకర్షించిన నీతా అంబానీ బ్లౌజ్.. స్పెషల్ ఏంటంటే..!

Nitaambaniblouse

Nitaambaniblouse

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది. ఇక పెళ్లి ప్రపంచ వ్యాప్తంగా బిగ్ హైలెట్‌గా నిలిచింది. పెళ్లి వేడుకల దగ్గర నుంచి అతిథుల రాక వరకు అన్ని స్పెషల్‌గా నిలిచాయి. ఇక అంబానీ కుటుంబం ధరించిన వస్త్రాలైతే చెప్పనక్కర్లేదు. ప్రతీది అత్యంత వైరెటీగా నిలిచింది.

తాజాగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ధరించిన బ్లౌజ్ వెరీ వెరీ స్పెషల్‌గా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నీతా అంబానీ ధరించిన జర్దోజీ ఘాగ్రా బ్లౌజ్‌లో ఆమె పిల్లలు, మనవళ్ల పేర్లు ఆకర్షణగా నిలిచాయి. డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా చేతితో చేయబడిన ఎంబ్రాయిడరీ ఆకట్టుకుంది. జర్దోజీ ఘాగ్రాలో ఆలయ ఆకృతులను ప్రతిబింబించాయి. అలాగే ఆమె కుటుంబ పేర్లతో అలంకరించబడింది. అలాగే ఆభరణాలు మరొక అద్భుతమైన సృష్టిగా నిలిచింది. ఈ బ్లౌజ్ అతిథులను అమితంగా ఆకర్షించింది. అంతేకాకుండా స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ప్రముఖంగా కనిపించింది.

ఇది కూడా చదవండి: Rakul Preet Brother: రకుల్ సోదరుడితో పాటు సినీ ప్రముఖుల అరెస్ట్?

జూలై 12న రాత్రి అనంత్-రాధిక వివాహం జరిగింది. ఇక జూలై 13న రాత్రి జరిగిన శుభ ఆశీర్వాద వేడుకలకు ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Exit mobile version