Site icon NTV Telugu

Nirmala Sitharaman: రామ మందిర ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు నిషేధం.. దేవాలయాల్లో పూజలు, అన్నదానం బ్యాన్..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశం సిద్ధమవుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రామ మందిర కార్యక్రమాలను తమిళనాడులో బ్యాన్ చేశారంటూ ఆరోపించారు. స్థానిక మీడియ కథనాన్ని ఉటంకిస్తూ.. జనవరి 22న రామ మందిర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎంకే ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, నిర్మాలా సీతారామన్ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తమిళనాడులోని దేవాలయాల్లో రాముడికి పూజుల, అన్నదానం వంటి కార్యక్రమాలపై నిషేధం లేదని చెప్పారు.

Read Also: Mary Millben: రామ మందిర వేడుకకు రాలేకపోవడం బాధగా ఉంది.. అమెరికన్ సింగర్..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. తమిళనాడులో 200 శ్రీరాముడి ఆలయాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే దేవాలయాల్లో పూజలు జరగడం లేదు. శ్రీరాముడి పేరిట భజన, ప్రసాదం, అన్నదానానికి అనుమతి లేదు. ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న ఆలయాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడ్డారు. మండపాలను తీస్తామని నిర్వాహకులు బెదిరిస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేకత, ద్వేషాన్ని ఖండిస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘లా అండ్ ఆర్డర్’ పేరుతో తమిళనాడులో రామ మందిర ఉత్సవాల లైవ్ టెలికాస్ట్‌లపై నిషేధం విధించిందని ఆమె ఆరోపించారు. ఇది అధికార డీఎంకే హిందూ వ్యతిరేక ప్రయత్నాల్లో భాగం అని ఆమె అన్నారు. అయితే డీఎంకే ప్రభుత్వ పెద్దలు మాత్రమ నిర్మలా సీతారామన్ అసత్యాలను, పుకార్లను ప్రచారం చేస్తున్నారని, ఇది దురదృ‌ష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version