Site icon NTV Telugu

Air India flight crash: కొత్త ఇళ్లు, భారత్‌లో కొత్త జీవితం.. కేరళ నర్సు కలల్ని చెరిపిన విమాన ప్రమాదం..

Ranhita

Ranhita

Air India flight crash: ఎయిరిండియా విమాన ప్రమాదం 265 మంది మరణించారు. ఎందరో కలల్ని ఈ ప్రమాదం చెరిపేసింది. కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని తిరువల్లకు చెందిన 39 ఏళ్ల నర్సు రంజిత్ గోపకుమార్ పెట్టుకున్న ఆశలన్ని కూలిపోయాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల్లో రంజిత కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన రంజిత యూకేలో నర్సుగా పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం భారతదేశానికి వచ్చింది.

Read Also: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ నిరాశే.. 10 రోజుల వ్యవధిలో రెండో ఫైనల్ ఓటమి!

త్వరలోనే పూర్తిగా భారతదేశానికి వచ్చేసి తన కూతుళ్లు, బంధువులతో సెటిల్ అవ్వాలని ఆశ పడింది. కేరళలో తన ప్రభుత్వ ఉద్యోగానికి కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేశారు. కేరళలో తన ఉద్యోగాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. త్వరలోనే యూకేలోని ఉద్యోగాన్ని వదిలేయాలని భావిస్తున్న సమయంలో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ఉద్యోగానికి ముందు రంజిత ఒమన్‌లోని సలాలాలో కొంత కాలం పనిచేశారు.

ఆమె తన కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి, తన పిల్లలు, తల్లిని మంచిగా చూసుకోవాలని అనుకున్నారు. రంజితకు 10 వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఇందుచూడన్ , 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల ఇతిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ప్రమాదానికి గురైన అహ్మదాబాద్-లండన్ విమానానికి ముందు, రంజిత చెన్నై నుంచి అహ్మదాబాద్‌కి కనెక్టింగ్ ఫ్లైట్‌లో చేరారు. రిలీజ్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఆమె యూకేకి వెళ్తున్నారు. ఎన్నో ఆశలతో భారత్ వచ్చి స్థిరపడాలని చూస్తున్న రంజితను విధి వంచించింది.

Exit mobile version