అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద బీభత్సానికి ఎంతోమంది నిరుపేదలు తమ గూడును, నీడను కోల్పోయారు. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు.భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన గ్రామాల్లో పర్యటించడానికి అసోం బీజేపీ ఎమ్మెల్యే సిబుమిశ్రా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ చోట కేవలం పాదం మునిగేంత నీరు మాత్రమే ఉంది. కానీ ఆ వరద నీటిలో నడిచేందుకు…