NTV Telugu Site icon

Congress: ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఒకే రకం..

Pm Modi, Pm Netanyahu

Pm Modi, Pm Netanyahu

Congress: కేరళలో అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా మద్దతు ర్యాలీలు చేపడుతున్నాయి. గురువారం కాంగ్రెస్ నేతృత్వంలో కోజికోడ్‌లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్‌తో పాటు మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ హాజరయ్యారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్రమోడీలు ఇద్దరు ఒకే రకం అని ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

Read Also: Israel: ఇరాన్ మంత్రితో హిజ్బుల్లా చీఫ్ భేటీ.. ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా రాకెట్ దాడి..

నెతన్యాహు, మోడీలు ఒకే రకం..ఒకరు జియోనిజం గురించి, మరొకరు జాతి ప్రక్షాళన గురించి ఆలోచిస్తున్నారని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. కేరళ పీసీసీ ఆధ్వర్యంలో కోజికోడ్ బీచ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పాలస్తీనా ప్రజలు తమ జన్మభూమి కోసం పోరాడుతున్నారని, ఆ పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేసీ వేణుగోపాల్ అన్నారు. అమెరికా ఎల్లప్పుడూ వలస రాజ్యాలకు మద్దతు ఇస్తుందని, అందుకే ఇజ్రాయిల్‌కి మద్దతు ఇస్తుందని అన్నారు. ఇజ్రాయిల్‌కి మద్దతు ఇవ్వడానికి మోడీ చాలా తొందరలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో అవలంభిస్తు్న్న పాలస్తీనా వైఖరికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విరుద్ధంగా ఉందని, ఇజ్రాయిల్-హమాస్ మానవతా సంధికి అనుకూలంగా భారత్ ఓటేయకపోవడాని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. గాంధీ దేశం ఓటేయలేదని అన్నారు. గతంలో అధికార సీపీఎం కూడా పాలస్తీనా సంఘీభావ ర్యాలీ చేసింది. దీనికి సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. భారత్, ఇజ్రాయిల్‌తో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Show comments