Benjamin Netanyahu: ‘‘ఇజ్రాయిలీల కళ్లు చెమ్మగిల్లాయి’’.. మోడీ ప్రసంగంపై నెతన్యాహూ భావోద్వేగం..

  • మీ ప్రసంగం ప్రతీ ఇజ్రాయిలీని కదిలించింది...
  • ప్రధాని మోడీపై ఇజ్రాయిల్ నెతన్యాహూ ప్రశంసలు..
Modi Netanyahu

Modi Netanyahu

Benjamin Netanyahu: ప్రధాని నరేంద్రమోడీపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం ఇజ్రాయిల్‌ ప్రజల్ని భావోద్వేగానికి గురిచేసిందని అన్నారు. మోడీ ప్రసంగంతో ప్రతీ ఇజ్రాయిలీ కళ్లు చెమ్మగిల్లాయని నెతన్యాహూ భావోద్వేగానికి గురయ్యారు. మోడీ రెండు రోజుల ఇజ్రాయిల్ పర్యటన చిన్నదే కానీ అసాధారణంగా హృదయపూర్వకంగా ఉందని చెప్పారు.

Read Also: Vamsi Nandipati : నంది అవార్డుల వివాదంపై స్పందించిన వంశీ నందిపాటి!

“ఇది అద్భుతమైన పర్యటన, అద్భుతమైన సందర్శనకు అద్భుతమైన ముగింపు. నిన్న నెస్సెట్‌లో మీరు చేసిన హృదయపూర్వక ప్రకటన తర్వాత ఇజ్రాయెల్‌లోని ప్రతీ వ్యక్తి కంట వెంట కన్నీరు వచ్చిందని భావిస్తున్నాను’’ అని అన్నారు. భారత్-ఇజ్రాయిల్ మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిన తర్వాత, నెతన్యాహూ ఈ భావోద్వేగ ప్రసంగం చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాత రెండోసారి ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. 9 ఏళ్లలో ఇది రెండో ఇజ్రాయిల్ పర్యటన. చివరిసారిగా 2017లో మోడీ ఆ దేశాన్ని సందర్శించారు.

బుధవారం, ఇజ్రాయిల్ పార్లమెంట్ నెస్సెట్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయిల్‌పై చేసిన దాడిని ‘‘అనాగరికమైంది’’గా అభివర్ణించారు. ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్న దానిని ఖండించాల్సిందే అని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. గాజా శాంతికి భారత్ మద్దతు ఉంటుందని వెల్లడించారు.