Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
- నేపాల్ వరద వినాశనం భారత్‌లో కనిపిస్తోంది..
- గండక్ నదిలోకి కొట్టుకొస్తున్న మృతదేహాలు..
- యూపీలోని జిల్లాల్లో 10 మృతదేహాలు లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal flood: నేపాల్ వరద విషాదం భారత్‌లో కనిపిస్తోంది. వినాశకమైన వరదల కారణంగా ఆ దేశంలో వందలాది మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. ఇప్పుడు వారి మృతదేహాలు దిగువన ఉన్న భారత్‌లోని నదుల్లోకి కొట్టుకొస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నదుల్లో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరద ప్రభావిత నేపాల్ నుంచి భారత్‌కు ఈ మృతదేహాలు కొట్టుకొస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న మహారాజ్ గంజ్, కుషీ నగర్ జిల్లాలోని గండక్ నదిలో ఆరు మృతదేహాలు లభించాయి. మృతుల వివరాలు, వారి కుటుంబాల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మహారాజ్‌గంజ్ లో గురువారం నది ఉద్ధృత ప్రవాహంలో మూడు మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నది, దాని పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) రెస్క్యూ బృందం మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించింది.
Also Read
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్‌లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
నేపాల్‌లో వరదలకు కారణమైన భోటేకోశీ, త్రిశూలి నది వ్యవస్థ నుంచి గండక్ నది భారత్ లోకి ప్రవేశిస్తుంది. టిబెల్‌లో పుట్టే భోటేకోశీ నది త్రిశూలి నదిలో కలుస్తుంది. ఆ తర్వాత ఈ నదీ వ్యవస్థ గండక్‌గా భారత్‌లోకి వస్తోంది. దీంతో నేపాల్ వరదల్లో చనిపోయిన వారి మృతదేశాలు ఈ నదిలో కనిపిస్తున్నాయి. కుషీనగర్ జిల్లాలో శుక్రవారం గండక్ నదిలో మరో మూడు మృతదేహాలు లభించాయి.
మృతదేహాలతో పాటు గండక్ నదిలోకి భారీగా శిథిలాలు, వాహనాలు, ఇంటి సామాగ్రి, గ్యాస్ సిలిండర్లు, డ్రమ్ములు, ఫర్నీచర్, చెట్ల దుంగలు వంటి వస్తువులు కొట్టుకొస్తున్నాయి. వీటిని తీసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు నది ఒడ్డుకు చేరుకుంటున్నారు. నది తీవ్రరూపం దాల్చడంతో అధికారులు వారిని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్‌పై జిన్‌పింగ్ వేటు.. భారత్‌కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్‌కు షాక్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!