NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..

  • నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ..
  • అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్..
Neet 2026

Neet 2026

NEET-UG 2026 paper leak: నీట్ 2026 పేపర్ లీక్ కేసును ఛేదించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న పూణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. నిందితుడు పీవీ కులకర్ణికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షా ప్రక్రియతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఎన్టీయే పరీక్ష ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నారు. నీట్ ప్రశ్నా పత్రాలకు సంబంధించి కులకర్ణికి డైరెక్ట్ యాక్సెస్ ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సీబీఐ చెప్పింది. మే 3న పరీక్ష జరగడానికి ముందే కెమిస్ట్రీ పేపర్‌లోని కొన్ని భాగాలను అతను లీక్ చేసినట్లు తెలిసింది.

నీట్ ప్రశ్నా పత్రాలను రూపొందించే ప్యానెల్‌లో కులకర్ణి ఒక సభ్యుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ చివరి వారంలో పూణేలోని తన నివాసం ఏర్పాటు చేసిన ఒక రహస్య కోచింగ్ క్లాస్‌లో ఈ కేసులోని మరో నిందితుడి సహాయంతో కులకర్ణీ ప్రశ్నలు, సరైన సమాధానాలు నీట్ అభ్యర్థులకు లీక్ చేశాడని సీబీఐ వెల్లడించింది. ఇలా చెప్పిన ప్రశ్నలు, జవాబులను విద్యార్థులు తమ నోట్ బుక్‌లో రాసుకున్నారు. ఇదే ప్రశ్నలు మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్ష కనిపించాయని సీబీఐ ప్రకటన తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. మే 3న జరిగిన ఈ పరీక్షకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, మే 12నప లీక్ విషయం వెలుగులోకి రావడంతో ఎన్‌టీఏ పరీక్షను రద్దు చేసింది.

×
×
Ad