NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ..
- అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-UG 2026 paper leak: నీట్ 2026 పేపర్ లీక్ కేసును ఛేదించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న పూణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. నిందితుడు పీవీ కులకర్ణికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షా ప్రక్రియతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఎన్టీయే పరీక్ష ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నారు. నీట్ ప్రశ్నా పత్రాలకు సంబంధించి కులకర్ణికి డైరెక్ట్ యాక్సెస్ ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సీబీఐ చెప్పింది. మే 3న పరీక్ష జరగడానికి ముందే కెమిస్ట్రీ పేపర్లోని కొన్ని భాగాలను అతను లీక్ చేసినట్లు తెలిసింది.
నీట్ ప్రశ్నా పత్రాలను రూపొందించే ప్యానెల్లో కులకర్ణి ఒక సభ్యుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ చివరి వారంలో పూణేలోని తన నివాసం ఏర్పాటు చేసిన ఒక రహస్య కోచింగ్ క్లాస్‌లో ఈ కేసులోని మరో నిందితుడి సహాయంతో కులకర్ణీ ప్రశ్నలు, సరైన సమాధానాలు నీట్ అభ్యర్థులకు లీక్ చేశాడని సీబీఐ వెల్లడించింది. ఇలా చెప్పిన ప్రశ్నలు, జవాబులను విద్యార్థులు తమ నోట్ బుక్‌లో రాసుకున్నారు. ఇదే ప్రశ్నలు మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్ష కనిపించాయని సీబీఐ ప్రకటన తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. మే 3న జరిగిన ఈ పరీక్షకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, మే 12నప లీక్ విషయం వెలుగులోకి రావడంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది.
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!