బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు విరామం లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kash Patel: చిక్కుల్లో ఎఫ్‌బీఐ చీఫ్.. ప్రియురాలి కోసం జెట్‌లో షికార్లు
ఇదిలా ఉంటే శుక్రవారం ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కూటమి పార్టీలన్నీ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సహా కూటమిలోని అగ్ర నాయకులందరూ హాజరై మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటలకు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Minor Girl Assault: 6వ తరగతి బాలికను లైంగికంగా వేధించిన పీటీఐ..
ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధానంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత వంటి ఇతర అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవలే ఇండియా కూటమి కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. 32 పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి చట్టం చేయనున్నట్లు ప్రకటించింది. ఇక జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్)లను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని తెలిపింది. నెలకు రూ. 30,000 వేల జీతం ఇస్తామని వెల్లడించింది.
బీహార్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒకరు అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాటం చేస్తున్నారు.
