Supreme court vs NCERT: సుప్రీంకోర్టు షాక్‌తో దిగొచ్చిన ఎన్సీఈఆర్టీ.. పాఠ్యాంశంపై కీలక నిర్ణయం
- సుప్రీంకోర్టు షాక్‌తో దిగొచ్చిన ఎన్సీఈఆర్టీ
- న్యాయవ్యవస్థ పాఠ్యాంశంపై ఎన్సీఈఆర్టీ విచారం
- ముద్రింపబడిన పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక సంస్థను అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది.
ఇంతలోనే పాఠ్యాంశంపై NCERT విచారం వ్యక్తం చేసింది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ అధ్యాయంపై చింతిస్తున్నట్లు పేర్కొంది. అనుచిత అంశాలను చేర్చడం వెనుక ఎలాంటి దురద్దేశం లేదని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తెలిపింది. ముద్రించిన పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ముద్రించిన 2.25 లక్షల కాపీలను గిడ్డంగికి తిరిగి పంపించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
రాజ్యాంగ అక్షరాస్యత, సంస్థాగత గౌరవం, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై అవగాహన పెంచడమే కొత్త పాఠ్యపుస్తకాల లక్ష్యం అని తెలిపింది. అంతే తప్ప ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ‘‘ఏ రాజ్యాంగ సంస్థ అధికారాన్ని ప్రశ్నించే లేదా తగ్గించే ఉద్దేశ్యం లేదు.’’ అని చెప్పింది.
అసలేం జరిగిందంటే..
NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే కంటెంట్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారు. పాఠశాల విద్యార్థులకు ఇలాంటి పాఠాలు నేర్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని.. ఇది చాలా విచారకరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠ్యాంశం తీరుపై న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Modi-Israel: ఇజ్రాయెల్ పార్లమెంట్లో భారత్ మేజర్ దల్పత్ సింగ్‌ను గుర్తుచేసిన మోడీ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని తాను గమనించానని చెప్పారు. సంస్థను కించపరుస్తామంటే ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదేదో ప్రణాళికబద్ధంగా.. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకంటే తాను ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. ఏదేమైనా ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం సూచించింది.
NCERT is trying to retrieve the 38 copies of the now-withdrawn Class 8 Social Science Part 2 textbook that were sold. Of the 2.25 lakh copies printed, 2,24,962 remained in inventory and have been recalled to the warehouse: Education Ministry Sources pic.twitter.com/nKQ8cecywW
— ANI (@ANI) February 26, 2026
తాజావార్తలు
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!